
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలో నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని సర్కిల్టౌన్ప్లానింగ్అధికారులు ఆదివారం కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాగ్అమీర్వద్ద హైవే పక్కన ఈ భవన నిర్మాణం చేపట్టటంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు భవన నిర్మాణదారుడికి గతంలో నోటీసు జారీ చేశారు. ఓనర్ సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులు పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణంలో ఉన్న భవనాన్నికూల్చివేశారు.